మల్టీప్లెక్స్‌కు వెళ్తున్నారా? క్యారేజీలకు క్యారేజీలు మోసుకెళ్లండి..!

Wed,July 18, 2018 04:01 PM

See how netizens reacted for Maharashtra Allowing Outside Food In Multiplexes

మహారాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి మల్టిప్లెక్స్‌కు సినిమాకు వెళ్లే వాళ్లు వెంట తినుబండారాలు తీసుకెళ్లొచ్చని ప్రకటించింది. ఆ మధ్య మల్టిప్లెక్స్‌లలో తినుబండారాలకు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారంటూ గొడవ జరిగింది. మహారాష్ట్ర నవనిర్మాన్ సేన(ఎంఎన్‌ఎస్) దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ముంబై, థానె, పూణె, ఇతర సిటీల్లో ఉన్న మల్టిప్లెక్స్‌లు ఐదు రూపాయల పాప్‌కార్న్‌ను రూ.250కి అమ్ముతున్నాయని తెలిపింది. సోషల్ మీడియా కూడా ఎంఎన్‌ఎస్ నిరసనకు మద్దతు తెలిపింది. నిజానికి ఈ సమస్య ఒక్క మహారాష్ట్రలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉంది. అయితే.. మల్టిప్లెక్స్‌లో అధిక ధరలపై వస్తున్న నిరసనలను పరిగణనలోకి తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి ప్రజలు తమ ఫుడ్ తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా మహారాష్ట్ర సివిల్ సప్లయి మినిస్టర్ రవింద్ర చవాన్ విడుదల చేశారు. దీంతో మహారాష్ట్ర వాసులే కాదు నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్లు మల్టిప్లెక్స్‌లపై జోకులు పేల్చుతున్నారు. కొంతమంది మెమెలు క్రియేట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ. ఇక.. సినిమాకు వెళ్లాలంటే ముందు క్యారేజీ రెడీ చేసుకొని ఆ తర్వాత వెళ్లాలని.. మరికొంతమంది.. పిక్‌నిక్.. గిక్‌నిక్ ఎందుకు ఏకంగా మల్టిప్లెక్స్‌నే స్పాట్ చేసుకొని అక్కడే పాగా వేస్తే బెటర్ అంటూ.. ఇలా జోక్స్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. వాటిలో కొన్ని బెస్ట్ ట్వీట్లను మీరు కూడా చూసి కాసేపు నవ్వుకోండి.

2534
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles