ఆడ‌వాళ్ల‌కు.. ఎక్క‌డా భ‌ద్ర‌త లేదు : రాబ‌ర్ట్ వ‌ద్రా

Tue,December 3, 2019 10:14 AM

హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు ఎక్క‌డా భ‌ద్ర‌త స‌రిగా లేద‌ని రాబ‌ర్ట్ వ‌ద్రా ఆరోపించారు. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో ఈ కామెంట్ చేశారు. ఇటీవ‌ల గాంధీ ఫ్యామిలీకి ఎస్పీజీ భ‌ద్ర‌త‌ను ఎత్తివేసిన విష‌యం తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం కొంద‌రు వ్య‌క్తులు కారులో నేరుగా ప్రియాంకా గాంధీ ఇంట్లోకి దూసుకువెళ్లారు. ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ.. రాబ‌ర్ట్ వ‌ద్రా కేంద్ర ప్ర‌భుత్వంపై కొన్ని ఆరోప‌ణ‌లు చేశారు. ఇది ప్రియాంకా గాంధీ, నా కూతురు, కుమారుడు, గాంధీ ఫ్యామిలీకి చెందిన భ‌ద్ర‌త విష‌యం కాదు అని, ఇది పౌరుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన అంశ‌మ‌న్నారు. దేశంలోని మ‌హిళ‌లు సుర‌క్షితంగా లేర‌న్నారు. దేశ‌వ్యాప్తంగా సెక్యూర్టీ విఫ‌ల‌మైన‌ట్లు చెప్పారు. అమ్మాయిల‌పై వేధింపులు, అత్యాచారాలు జ‌రుగుతున్నాయ‌ని, ఎటువంటి స‌మాజాన్ని మ‌నం సృష్టిస్తున్నామ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌తి పౌరుడికి భ‌ద్ర‌త క‌ల్పించ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త అన్నారు. మ‌న దేశంలో, మ‌న ఇండ్ల‌ల్లో, మ‌న రోడ్ల‌పై, ప‌గ‌లూ రాత్రి క్షేమంగా లేకుంటే.. మ‌రి వాళ్లు ఎప్పుడు, ఎక్క‌డ క్షేమంగా ఉంటార‌న్నారు.

793
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles