రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో 61.12 శాతం పోలింగ్

Thu,April 18, 2019 08:04 PM

second phase is 61.12 percent polling in the Lok Sabha polls

ఢిల్లీ: రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ర్టాల్లోని మొత్తం 95 లోక్‌సభ నియోజకవర్గాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 61.12 శాతం పోలింగ్ నమోదైంది. అసోం 73.32 శాతం, బీహార్ 58.14శాతం, ఛత్తీస్‌గఢ్ 68.70 శాతం, జమ్ముకశ్మీర్ 43.37శాతం, కర్ణాటక 61.80శాతం, మహారాష్ట్ర 55.37శాతం, మణిపూర్ 74.69శాతం, ఒడిశా 57.41శాతం, పుదుచ్చేరి 72.40 శాతం, తమిళనాడు 61.52శాతం, ఉత్తరప్రదేశ్ 58.12శాతం, పశ్చిమబెంగాల్ 75.27శాతం పోలింగ్ నమోదైంది.

858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles