పుల్వామా పోలింగ్ బూత్‌పై గ్రేనేడ్ దాడి

Mon,May 6, 2019 02:47 PM

Second Grenade Attack on Polling Booth in Pulwama

హైద‌రాబాద్‌: పుల్వామాలో రెండు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అక్క‌డ ఇవాళ లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఉద‌యం రాహ‌మూ గ్రామంలో ఓ పోలింగ్ స్టేష‌న్ ద‌గ్గ‌ర పేలుడు సంభ‌వించింది. ప్ర‌భుత్వ స్కూల్‌లో ఉన్న పోలింగ్ బూత్ నుంచి భారీ స్థాయిలో శ‌బ్ధం వినిపించింది. ఇవాళ మ‌ధ్యాహ్నం మ‌రో ప్రాంతంలో గ్రేనేడ్ దాడి జ‌రిగింది. పోలింగ్ సెంట‌ర్‌కు చెందిన ఓ గోడ ఆ పేలుడు ధాటికి ధ్వంస‌మైంది. మ‌రోవైపు బెంగాల్‌లో కూడా హింస చోటుచేసుకున్న‌ది. బరాక్‌పోర్‌, బ‌న్‌గావ్‌, హౌరా, హూగ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో హింసాత్మ‌క సంఘట‌న‌లు జ‌రిగాయి.

1006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles