బ్లాక్‌మ‌నీ టు వైట్‌మ‌నీ వ‌యా ఈశాన్య రాష్ట్రాలు

Thu,November 24, 2016 10:19 AM

Scrapped notes are flying off to the Northeast to make them Legetimate

న్యూఢిల్లీ: నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో న‌ల్ల కుబేరుల‌కు ఈశాన్య రాష్ట్రాలు వ‌రంగా మారాయి. కోట్ల బ్లాక్‌మ‌నీని అక్క‌డికి పంపి దానిని వైట్‌మ‌నీగా మార్చేసుకుంటున్నారు. తాజాగా నాగాలాండ్‌లో దొరికిన రూ.3.5 కోట్ల విలువైన రూ.500, వెయ్యినోట్లే దీనికి నిద‌ర్శ‌నం. ప్ర‌త్యేకంగా చార్టెర్డ్ విమానంలో ఈ డ‌బ్బు నాగాలాండ్ రావ‌డం గ‌మ‌నార్హం. ఈ కేసులో నాగాలాండ్ ఎంపీ నీఫియు రియో అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేప‌థ్యంలో అస‌లు న‌ల్ల‌ధ‌నానికి, ఈశాన్య రాష్ట్రాల‌కు సంబంధం ఏమిట‌న్న అనుమానం రావ‌డం స‌హ‌జ‌మే. ఇక్క‌డే ఓ ఆస‌క్తిక‌ర విష‌యం దాగుంది. దేశంలో ఉన్న న‌ల్ల‌ధ‌న‌మంతా ఈశాన్య రాష్ట్రాల‌కు వెళ్ల‌డానికి ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంది. అదే ఆదాయ ప‌న్ను మిన‌హాయింపు.

మ‌న దేశంలో ప‌న్ను మిన‌హాయింపులు పొందుతున్న వారిలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న షెడ్యూల్డ్ ట్రైబ్ సామాజిక‌వ‌ర్గాలే ఎక్కువ‌. ఈశాన్య రాష్ట్రాల‌పై నాగాలాండ్‌, మ‌ణిపూర్‌, త్రిపుర‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, మిజోరాం రాష్ట్రాల్లో ఉన్న ఎస్టీ సామాజిక వ‌ర్గాల‌కు ఆదాయ ప‌న్ను ఉండ‌దు. ఇవే కాకుండా అసోంలోని నార్త్ క‌చార్ హిల్స్‌, మికిర్ హిల్స్‌.. మేఘాల‌య‌లోని ఖాసి హిల్స్‌, గారో హిల్స్‌, జైన్‌తియా హిల్స్‌.. జ‌మ్ముక‌శ్మీర్‌లోని ల‌డ‌క్‌ల‌లో ఉండే ఎస్టీలు కూడా ఇన్‌క‌మ్ ట్యాక్స్ క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఇక్క‌డున్న‌వారికి ఏ వ‌న‌రు నుంచి ఆదాయం వ‌చ్చినా ట్యాక్స్ ఉండ‌దు. దేశంలోని వెనుక‌బ‌డిన ప్రాంతాలు, సామాజిక వ‌ర్గాల‌కు ఆర్థిక రాయితీలు క‌ల్పించ‌డంలో భాగంగా ఇలా ఆదాయ ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చారు. అయితే ప్ర‌స్తుతం నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఈ రాయితీలే న‌ల్ల కుబేరుల‌కు వ‌రంగా మారాయి.

ఈ రాయితీల‌ను అడ్డం పెట్టుకొని న‌ల్లధ‌నాన్ని తెల్ల‌ధ‌నంగా మార్చుకుంటున్నారు. కోట్ల విలువైన ర‌ద్ద‌యిన పాత నోట్లు ఈశాన్య రాష్ట్రాల‌కు వెళ్లి చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ఆదాయంగా మారుతోంది. తాజాగా నాగాలాండ్‌లో ప‌ట్టుబ‌డ్డ మూడున్న‌ర కోట్లు కూడా ఓ హ‌ర్యానా వ్యాపార‌వేత్త‌వ‌ని ఐటీ అధికారులు చెప్పారు. ఇక్క‌డ ఉండే చిన్న‌చిన్న ఎయిర్‌పోర్టుల్లో స‌రైన భ‌ద్ర‌త లేక‌పోవ‌డం, ఆదివాసీ ప్రాంతాల్లో ఉండే ప‌న్ను రాయితీల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు దేశంలోని న‌ల్ల కుబేరులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఐటీ అధికారులు అంటున్నారు. ఎంపీ అల్లుడు అన‌తో జిమోమియే ఈ మూడున్న‌ర కోట్ల న‌ల్ల‌ధ‌నాన్ని చ‌ట్ట‌బ‌ద్ధంగా మార్చి మ‌ళ్లీ ఆ వ్యాపార‌వేత్త‌కు పంపాల‌ని ప్ర‌య‌త్నించ‌గా.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్ప‌టికే ఇలా రూ.11 కోట్ల విలువైన ర‌ద్ద‌యిన నోట్ల‌ను అన‌తో త‌న అకౌంట్లో వేసి వాటిని కొత్త నోట్లుగా మార్చేశాడు.

5397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles