మణిపూర్‌లో సైన్స్ కాంగ్రెస్ సదస్సు

Thu,December 28, 2017 07:32 AM

Science Congress Conference will held in Manipur Central University

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక 105వ సైన్స్ కాంగ్రెస్ సదస్సు మణిపూర్‌లో జరుగనుంది. ఇంఫాల్‌లోని మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీలో మార్చి 18 నుంచి 22 వరకు ఈ సదస్సును నిర్వహించే అవకాశముంది. తేదీలపై త్వరలో నిర్ణయం వెలువడనున్నది. మొదట ఈ సదస్సును జనవరి 3 నుంచి 7వరకు ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించాలని భావించారు. అయితే విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో సదస్సు నిర్వహించలేమని ఉస్మానియా యూనివర్సిటీ పేర్కొనడంతో సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కోల్‌కతాలో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమావేశంలో సదస్సును మణిపూర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి రుసుములను ఉస్మానియా తిరిగి ఇస్తుందని, మణిపూర్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనాలనుకునే వారు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

1349
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles