ముంబయిలోని స్కూల్స్, కాలేజీలకు నేడు సెలవు

Thu,September 19, 2019 07:13 AM

ముంబయి: ముంబయిలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు నేడు సెలవును ప్రకటించారు. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు అప్రమత్తతను ప్రకటించింది. ముంబయి, రాయిగఢ్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొంటూ రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు. దీంతో ముంబయి, థానే, కొంకన్, ప్రాంతాల్లోని అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవును ప్రకటించారు. మహారాష్ట్రలోని ఇతర జిల్లాల కలెక్టర్లు స్థానిక పరిస్థితులను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటారని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆశిష్ షెలార్ పేర్కొన్నారు.

1861
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles