పాఠశాల భూ వివాదం.. ప్రిన్సిపాల్ హత్య

Mon,October 15, 2018 11:27 AM

SCHOOL PRINCIPAL KILLED BY A GANG IN BENGALURU

బెంగళూరు : పాఠశాల భూ వివాదం.. ప్రిన్సిపాల్ హత్యకు దారి తీసింది. ఈ దారుణ సంఘటన బెంగళూరులోని హవనూర్ పబ్లిక్ స్కూల్‌లో ఆదివారం చోటు చేసుకుంది. 60 ఏళ్ల రంగనాథ్ హవనూర్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆదివారం సెలవు దినమైనప్పటికీ.. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాడు. క్లాస్ అయిపోయాక తన కార్యాలయంలో పాఠశాల భూ వివాదానికి సంబంధించి మాట్లాడుతుండగా.. రంగనాథ్‌పై మారణాయుధాలతో ఆరుగురు దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో రంగనాథ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తుండగా.. ఒక నిందితుడు మహాలక్ష్మి లేఔట్ వద్ద పట్టుబడ్డాడు. ఇద్దరు పోలీసులపై నిందితుడు బాబ్లీ మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. మిగతా ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

1484
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles