గాంధీజీ ప్రమాదవశాత్తు చనిపోయారట..!

Fri,November 15, 2019 02:24 PM


భువనేశ్వర్‌: నాథూరాం గాడ్సే జరిపిన కాల్పుల్లో జాతిపిత మహాత్మాగాంధీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఒడిశాలోని ఓ స్కూల్‌లో పంపిణీ చేసిన కరపత్రంలో గాంధీజీ ప్రమాదవశాత్తు చనిపోయారని ముద్రించారు. 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో గాంధీజీ ప్రమాదశాత్తు చనిపోయారని బుక్‌లెట్‌పై రాసి ఉంది. దీంతోపాటు ఒడిశాతో గాంధీజీకున్న అనుబంధం, ఇతర అంశాలను బుక్‌లెట్‌పై పొందుపర్చారు. అయితే జాతిపిత మరణానికి సంబంధించి జరిగిన ఈ తప్పిదంపై పలువురు రాజకీయ వేత్తలు, సామాజిక వేత్తల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘అవర్‌ బాపూజీ..ఏ గ్లింప్స్‌’ పేరుతో ప్రచురించిన రెండు పేజీల బుక్‌లెట్‌లో జరిగిన తప్పిదంపై సీఎం నవీన్‌ పట్నాయక్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.


గాంధీజీని నాథూరాం గాడ్సే చంపాడని అందరికీ తెలుసు. ఆ తర్వాత గాడ్సేను పట్టుకుని ఉరి కూడా తీశారు. స్కూల్‌ పిల్లలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పుడు సమాచారంతో ముద్రించిన బుక్‌లెట్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అశిష్‌ కనుంగో డిమాండ్‌ చేశారు.

2295
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles