అనైతిక‌ ఆర్థిక ప్ర‌యోగాలు వద్దు..

Thu,November 8, 2018 01:03 PM

Scars of demonetisation more visible with time: Manmohan Singh

న్యూఢిల్లీ: నోట్ల ర‌ద్దు చ‌ర్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు మ‌రోసారి అసంబ‌ద్ధ ఆర్థిక నిర్ణ‌యాలు తీసుకోరాదు అని మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ఇవాళ ఎన్డీఏ ప్ర‌భుత్వానికి సూచించారు. నోట్ల ర‌ద్దు చ‌ర్య చేపట్టి రెండేళ్లు పూర్తి అయిన సంద‌ర్భంగా మ‌న్మోహ‌న్ స్పందించారు. స‌మ‌గ్ర‌మైన ఆర్థిక విధానాల‌ను పున‌ర్ స్థాపించాల‌ని ఆయ‌న కోరారు. స్వ‌ల్ప కాలిక ఆర్థిక చ‌ర్య‌ల‌తో మ‌ళ్లీ ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తినే ప్రమాదం ఉంద‌న్నారు. స్టాక్ మార్కెట్లు కూడా బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. నోట్ల ర‌ద్దు ఓ సంకుచిత నిర్ణ‌య‌మ‌ని, ఆ నిర్ణ‌యం వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ ఎలా దెబ్బ‌తిన్న‌దో ఇప్పుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని అన్నారు. నోట్ల ర‌ద్దు ప్ర‌తి ఒక్క‌రిపై ప్ర‌భావం చూపింద‌న్నారు. అనైతిక ఆర్థిక చ‌ర్య‌ల వ‌ల్ల దీర్ఘ‌కాలిక ప్ర‌భావం ఉంటుంద‌ని, అలాంటి చ‌ర్య‌ల‌ను క‌చ్చిత‌మైన ఆర్థిక విధానాల ద్వారా చేప‌ట్టాల‌న్నారు. డిమానిటైజేష‌న్ జ‌రిగి రెండేళ్లు అయినా, ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేద‌న్నారు. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు పునాది అయిన చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా వ్యాపారాలు ఇంకా నోట్ల ర‌ద్దు షాక్ నుంచి కోలుకోవాల్సి ఉంద‌న్నారు.

1395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS