సుప్రీంకోర్టు చరిత్రలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు...

Sat,August 4, 2018 04:12 PM

SC To Have Three Sitting Woman Judges Simultaneously For the First Time In 68 Years

ఢిల్లీ: 68 ఏండ్ల సుప్రీంకోర్టు చరిత్రలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఒకే సారి నియమించబడ్డారు. మొన్నటి వరకు ఇద్దరు మహిళా న్యాయమూర్తులు జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందూ మల్కోత్రా ఉండే వారు. వారికి జస్టిస్ బెనర్జి రాకతో సుప్రీంకోర్టులో తొలిసారిగా ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటి వరకు ఏడుగురు మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. అందులో మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ. అనంతరం సుజాతా మనోహర్, రమాపాల్, సుధా మిశ్రా, రంజనా ప్రకాశ్ దేశాయ్, బానుమతి, ఇందు మల్హోత్రాలు న్యాయమూర్తులుగా ఉన్నారు. ఇందులో అందరూ దాదాపు ఒంటరి మహిళా న్యాయమూర్తిగానే కొనసాగారు.

1400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS