మ‌రాఠా రిజ‌ర్వేష‌న్లు.. స్టే ఇవ్వ‌ని సుప్రీం

Fri,July 12, 2019 03:03 PM

SC declines stay on Maratha reservation order, issues notice to Maharashtra govt

హైద‌రాబాద్‌: మ‌రాఠా రిజ‌ర్వేష‌న్ల అంశంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. ఈ కేసులో అత్యున్న‌త న్యాయ‌స్థానం మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి నోటీసులు ఇచ్చింది. విద్యా, ఉద్యోగాల్లో మ‌రాఠా వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఇచ్చిన‌ ఆదేశాల‌ను గ‌తంలో ముంబై హైకోర్టు స‌మ‌ర్థించింది. అయితే ముంబై కోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ కేసులో ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది. మ‌రాఠా రిజ‌ర్వేష‌న్‌కు రాజ్యాంగ నిబ‌ద్ధ‌త లేద‌ని జే ల‌క్ష్మ‌ణ్ రావు కోర్టులో స‌వాల్ చేశారు. కొన్ని ప‌రిస్థితుల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్ కోటాను దాటాల్సిన అవ‌స‌రం త‌లెత్తుతుంద‌ని బాంబే హైకోర్టు గ‌త తీర్పులో పేర్కొన్న‌ది. మ‌రాఠా క‌మ్యూనిటీ సామాజికంగా, ఆర్థికంగా వెనుక‌బ‌డి ఉంద‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది.

450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles