
న్యూఢిల్లీ: వరకట్న వేధింపు కేసులపై సుప్రీంకోర్టు కొత్త తీర్పును వెలువరించింది. సెక్షన్ 498ఏ కింద నమోదు అయ్యే వరకట్న కేసుల్లో.. వెంటనే అరెస్టులు జరగాలని కోర్టు ఆదేశించింది. ఈ సెక్షన్ కింద నమోదు అయ్యే కేసులను ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ పరిశీలించాలని గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం మళ్లీ మార్చేసింది. గత తీర్పును సవరించిన అత్యున్నత న్యాయస్థానం.. 498 కేసు కింద వెంటనే అరెస్టులు చేయాలని ఇవాళ ఆదేశించింది. సెక్షన్ 498ఏను దుర్వనియోగం చేస్తున్నారని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.