ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెరిగాయ్!

Wed,November 28, 2018 02:35 PM

SBI increased its Interest Rates on Fixed Deposits for some Maturities

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. పెరిగిన రేట్లు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే కొన్ని మెచ్యూరిటీలపైనే ఈ రేట్లను బ్యాంకు పెంచింది. రూ.కోటిలోపు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. 0.05 శాతం నుంచి 0.1 శాతం మేర వడ్డీరేట్లను ఎస్‌బీఐ పెంచింది. ఏడాది నుంచి రెండేళ్ల వరకు, రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు మెచ్యూరిటీ పీరియడ్లు ఉన్న డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు పెంచారు. సాధారణ ప్రజలు ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి ఉంటే దానిపై గతంలో 6.7 శాతంగా ఉన్న వడ్డీ ఇప్పుడు 6.8 శాతానికి పెరిగింది. ఇక రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య డిపాజిట్ చేసిన వాళ్లకు గతంలో ఉన్న 6.75 శాతం వడ్డీ ఇప్పుడు 6.8 శాతానికి చేరింది. అటు సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే ఏడాది నుంచి రెండేళ్ల మధ్య ఉన్న డిపాజిట్లకు 7.2 శాతం ఉన్న వడ్డీ ఇప్పుడు 7.3 శాతానికి చేరుకోగా.. రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య ఉన్న డిపాజిట్లకు 7.25 శాతం ఉన్న వడ్డీ రేటు 7.3 శాతానికి పెరిగింది. ఇక ఎస్‌బీఐ స్టాఫ్, పెన్షనర్ల వడ్డీ రేట్లు వీటి కంటే ఒక శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక సాధారణ ప్రజలకు ఇచ్చే వడ్డీ రేటు కంటే వృద్ధులకు 0.5 శాతం ఎక్కువగా ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది.

3240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles