ఎస్‌బీఐకి రూ.40లక్షల జరిమానా

Thu,March 8, 2018 03:47 PM

SBI fined Rs 40 lakh for flouting fake note normsన్యూఢిల్లీ తాము జారీచేసిన ఆదేశాలను ధిక్కరించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రూ.40లక్షల జరిమానా వేసింది. నకిలీ నోట్ల గుర్తింపు, స్వాధీనానికి సంబంధించి జారీ చేసిన ఆదేశాలకు లెక్కచేయకపోవడంతో ఈ పెనాల్టీ విధించింది. తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఇన్స్‌పెక్షన్ రిపోర్ట్, ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా.. ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించకపోవడం వల్ల.. జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వాలని జనవరి 2, 2018న బ్యాంకుకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. వ్యక్తిగత వివరణ, బ్యాంకు ఇచ్చిన సమాధానాలను పరిశీలించి ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుగుణంగా ఈ జరిమానా విధించినట్ల నోటిఫికేషన్‌లో పేర్కొంది.

2486
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS