పాకిస్థాన్ ముర్దాబాద్ అనండి.. రూ.10 డిస్కౌంట్ పొందండి!

Thu,February 21, 2019 11:25 AM

Say Pakistan Murdabad and get 10 discount on Chicken offers this Chattisgarh Seller

రాయ్‌పూర్: పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ పేరు చెబితేనే దేశం మండిపడుతున్నది. ఎటు చూసినా పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు, నిరసనలు హోరెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఓ బూట్ల దుకాణం వ్యక్తి ఈ పాకిస్థాన్ వ్యతిరేకతను ఎలా ప్రచారంగా వాడుకున్నాడో మనం చూశాం. తాజాగా చత్తీస్‌గఢ్‌లో అంజల్ సింగ్ అనే ఓ ఫుడ్‌స్టాల్ ఓనర్ కూడా తన దగ్గరికి వచ్చే కస్టమర్లలో దేశభక్తిని రగిల్చే పనిలో ఉన్నాడు. పాకిస్థాన్ ముర్దాబాద్ అనండి.. చికెన్ లెగ్ పీస్‌పై రూ.10 డిస్కౌంట్ పొందండి అంటూ ఓ ఆఫర్ అతను ప్రకటించడం విశేషం. పాకిస్థాన్ ఎప్పుడూ మానవత్వానికి విలువ ఇవ్వలేదు. ఇవ్వదు కూడా. అందుకే ప్రతి ఒక్కరూ పాకిస్థాన్ ముర్దాబాద్ అనాలి అని అంజల్ సింగ్ అంటున్నాడు.


1579
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles