శనివారం 16 మార్చి 2019.. మీ రాశి ఫలాలు

Sat,March 16, 2019 05:54 AM

Saturday 16th march 2019 your horoscope

మేషం

మేషం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.


వృషభం

వృషభం : మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి సాయాన్ని పొందుతారు.


మిథునం

మిథునం: ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మం చిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.


కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.


సింహం

సింహం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.


కన్య

కన్య: ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.


తుల

తుల: వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.


వృశ్చికం

వృశ్చికం: దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. విదేశీయానానికి సంబంధించి ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. దైవ దర్శనం చేసుకుంటారు.


ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు.


మకరం

మకరం: ఈ రోజువ్యాపార లావాదేవీలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి.వివాహ విషయంలో అనుకూలమైన ఫలితం వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఉద్యోగ విషయంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.


కుంభం

కుంభం : వృత్తి విషయంలో మార్పులు చోటు చేసుకుంటాయి. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నరాలు, మెడకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడే అవకాశముంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.


మీనం

మీనం : మీ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంటుంది. దీంతో మానసికంగా ఆందోళనకు లోనవుతారు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఇంటికి వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతానం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

10004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles