తమిళ పేర్లు పలకడం చాలా కష్టం: సంజయ్ మంజ్రేకర్

Sat,February 18, 2017 08:29 PM

Sanjay Manjrekar criticized for tweet about Tamil Nadu politics

'తమిళనాడు రాజకీయాలు అంటే నాకిష్టం లేదు. వారి పేర్లు పలికేందుకే చాలా కష్టంగా ఉంటాయి.' ఇవీ... ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో చేసిన వ్యాఖ్యలు. తమిళనాడులో గత కొద్ది రోజులుగా సీఎం కుర్చీ కోసం పోరు జరుగుతున్న నేపథ్యంలో నేడు ఆ సమరానికి తెర పడింది. పళనిస్వామి బలపరీక్షలో నెగ్గడంతో స్పీకర్ ఆయన్ను సీఎంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే సంజయ్ మంజ్రేకర్ ట్విట్టర్‌లో ఆ వ్యాఖ్యలు చేశారు.

అయితే సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యల పట్ల తమిళ నెటిజన్లు తీవ్రంగా మండిపతున్నారు. ట్విట్టర్‌లో ఆయనకు సెటైర్లు, జోకులు వేస్తున్నారు. కేవలం సాధారణ నెటిజన్లే కాదు, పలువురు సెలబ్రిటీలు కూడా సంజయ్ వ్యాఖ్యల పట్ల స్పందించారు. సినీ నటి సమంతనైతే వరుస ట్వీట్లతో సంజయ్ వ్యాఖ్యలను ఖండించింది. మరికొందరు కూడా సంజయ్‌కు ఇది తగదని అన్నారు.

1765
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles