సానియాపై నెటిజన్ల ఆగ్రహం

Mon,February 18, 2019 06:57 PM

గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో పుల్వామా దాడి గురించే చర్చ. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని భారతీయులందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. పుల్వామా దాడికి సహకరించిన పాకిస్థాన్‌పై సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా సానియా మీర్జాపై కూడా సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. ఎందుకంటే.. ఆమె పుల్వామా దాడి తర్వాత తన ట్విట్టర్‌లో ఒక పెద్ద లేఖనే పోస్ట్ చేసింది. ఆ లేఖ‌లో ఒక పొర‌పాటు చేసింది.


"సెలబ్రిటీలు ఖచ్చితంగా దాడిని ఖండించాలా? ట్వీట్ చేయాలా. ఇన్‌స్టాగ్రామ్ చేయాలా.. వాళ్ల దేశభక్తిని చాటుకోవాలంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో స్పందించాల్సిందేనా. ఒకవేళ స్పందించకపోతే వాళ్లకు దేశభక్తి లేనట్టా? నేను నా దేశం కోసం ఆడుతాను. దేశం కోసం చెమట చిందిస్తాను. దేశానికి సేవ చేస్తాను. సీఆర్‌పీఎఫ్ జవాన్లకు, వాళ్ల కుటుంబాలను నేను అండగా నిలబడతా. వాళ్లు నిజమైన హీరోలు. 14 ఫిబ్రవరి భారత్‌కు బ్లాక్ డే. మళ్లీ ఇటువంటి రోజు మనకు రాకూడదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ట్రోల్ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న వాళ్లకు ఏమీ దొరకదు. ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు. ఉండదు కూడా. సెలబ్రిటీలను ట్రోల్ చేయడం కాదు... దేశానికి ఏదో ఒక విధంగా సేవ చేయడానికి పూనుకోండి.." అంటూ సాగింది తన కథనం.


అంతా బాగానే ఉంది కానీ.. తన ట్వీట్‌లో ఎక్కడా 'పాకిస్థాన్' అనే పేరునే వాడలేదు సానియా. అదే ఇప్పుడు తన కొంప ముంచింది. పబ్లిక్ ఫిగర్లను ట్రోల్ చేయకండి అని చెప్పినా వినకుండా.. అంత పెద్ద లేఖ రాశావు సరే.. పాకిస్థాన్ అనే పదం వాడటానికి ఎందుకమ్మా నీకు మనసు రాలేదు. నీ దేశ భక్తిని మేము శంకించడం కాదు. పాకిస్థాన్ వల్లనే కాదు మనకు ఇన్ని బాధలు. 7 లెటర్లు ఉన్న పాకిస్థాన్ అనే పేరును వాడటానికి నీ లేఖలో ప్లేస్ సరిపోలేదా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మరి.. దానికి సానియా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

8349
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles