బాబా సాహెబ్‌కు సైకత శిల్పి నివాళి

Thu,April 14, 2016 01:26 PM

sand artist sudharshan patnaik paid tributes to baba saheb

భువనేశ్వర్: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్‌కు అరుదైన నివాళి అర్పించారు సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. ఇవాళ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఒడిశాలోని పూరీ బీచ్‌లో అంబేద్కర్ సైకత శిల్పాన్ని తీర్చి దిద్ది ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహంపైన భారత జాతీయ పతాకంలోని మూడు రంగులను పేర్చారు. అంబేద్కర్ పక్కన అశోకుని చిహ్నాన్ని, మరో పక్క అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నివాళులు తెలుపుతూ శిల్పాన్ని తీర్చి దిద్దారు. సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రముఖులకు, ఏదైనా సంఘటన జరిగినపుడు దానిని వివరిస్తూ పూరీ బీచ్‌లో సైకత శిల్పాలను తయారు చేస్తుంటారు. సుదర్శన్ పట్నాయక్ త్వరలో రష్యాలో నిర్వహించనున్న అంతర్జాతీయ సైకత శిల్ప పోటీల్లో పాల్గొననున్నారు.

2728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles