ఏపీ ప్రొటెం స్పీకర్‌గా శంబంగి ప్రమాణం

Sat,June 8, 2019 11:33 AM

Sambangi Venkatachina Appala Naidu appointed as pro tem Speaker

అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. శంబంగి చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, కొత్తగా ఎంపికైన మంత్రులు, సచివాలయ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అప్పలనాయుడిని గవర్నర్ నరసింహన్, సీఎం జగన్ అభినందించారు. బొబ్బిలి నియోజకవర్గం నుంచి శంబంగి.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌గా శాసనసభ సమావేశాల తొలిరోజున ఎమ్మెల్యేల చేత శంబంగి ప్రమాణస్వీకారం చేయిస్తారు. స్పీకర్ ఎన్నిక కొనసాగే వరకు శంబంగి ప్రొటెం స్పీకర్‌గా కొనసాగుతారు.

1446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles