భారీగా పెరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి జీతాలు

Thu,February 1, 2018 12:36 PM

salary of president to go up to 5 lakhs

న్యూఢిల్లీః కేంద్ర బడ్జెట్‌లో భాగంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ల జీతాలు పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కొత్త పేస్కేల్ ప్రకారం రాష్ట్రపతికి రూ.5 లక్షలు, ఉపరాష్ట్రపతికి రూ.4.5 లక్షలు, గవర్నర్లకు రూ.3.5 లక్షలుగా నిర్ణయించినట్లు జైట్లీ వెల్లడించారు. వీళ్లతోపాటు ఎంపీల జీతాలు కూడా పెరగనున్నాయి. ఇక ఎంపీల జీతాలు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రతి ఐదేళ్లకోసారి ఆటోమేటిగ్గా పెరిగేలా ఓ చట్టాన్ని తీసుకురానున్నట్లు జైట్లీ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రపతి జీతం రూ.1.5 లక్షలు ఉండగా.. దానిని ఒకేసరి ఐదు లక్షలకు పెంచడం గమనార్హం. ఇక ఉపరాష్ట్రపతి ఇప్పటివరకు రూ.1.25 లక్షలు అందుకుంటుండగా.. ఇక నుంచి రూ.4.5 లక్షలు ఇవ్వనున్నారు.

4402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles