పుల్వామా దాడికి ఉపయోగించిన కారు ఓనర్‌ హతం

Tue,June 18, 2019 03:19 PM

Sajjad Bhat Owner of Car Used in Pulwama Attack Killed in Gunfight With Security Forces

శ్రీనగర్‌ : ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ఉగ్రవాదులు కారును ఉపయోగించిన విషయం విదితమే. సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ను ఆ కారుతో ఢీకొట్టడంతో పేలుళ్లు జరిగి 40 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఆ కారు ఓనర్‌ను ఇవాళ భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కారు యజమానిని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన సజ్జద్‌ అహ్మద్‌ భట్‌గా బలగాలు గుర్తించాయి. అహ్మద్‌ భట్‌తో పాటు మరో ఉగ్రవాదిని అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బలగాలు కాల్చి చంపాయి. పుల్వామా ఉగ్రదాడికి మారుతి ఎకో కారును ఉపయోగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) గుర్తించిన సంగతి తెలిసిందే. 17 ఏళ్ల వయసున్న సజ్జద్‌ భట్‌ అనంత్‌నాగ్‌ జిల్లాలోని మహర్మ ఏరియాకు చెందిన వ్యక్తి అని పోలీసులు తేల్చారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భట్‌ అదృశ్యమై.. ఆ తర్వాత జైషే ఉగ్రవాద సంస్థలో చేరాడు. తానే పుల్వామా ఉగ్రదాడి ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడు భట్‌. ఆ సమయంలో ఏకే47తో భట్‌ ఉన్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

3627
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles