జాకిర్ హుస్సేస్‌తో స‌చిన్ జుగ‌ల్‌బందీ.. వీడియోWed,January 11, 2017 03:40 PM
జాకిర్ హుస్సేస్‌తో స‌చిన్ జుగ‌ల్‌బందీ.. వీడియో

ముంబై: ఒక‌రు క్రికెట్ లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్‌.. మ‌రొక‌రు త‌బ‌లా మేస్ట్రో జాకిర్ హుస్సేన్. మ‌రి ఈ ఇద్దరి జుగ‌ల్‌బందీకి ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అందుకే మాస్ట‌ర్ ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన కాసేప‌టికే వైర‌ల్‌గా మారిపోయింది. రెండు గంట‌ల్లోనే రెండు ల‌క్ష‌ల వ్యూస్‌, 2500 షేర్స్ రావ‌డం విశేషం. మ్యూజిక్ అంటే చాలా ఇష్ట‌ప‌డే స‌చిన్‌.. జాకిర్ హుస్సేన్‌తో క‌లిసి త‌బ‌లా వాయించాడు. నిమిషానికి పైగా ఉన్న ఈ వీడియోను ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చివ‌రికి జాకిర్ హుస్సేన్ స్పీడు ముందు మాస్ట‌రే ఓడిపోయాడు.

జ‌న‌వ‌రి 9న జ‌ర్నీ ఆఫ్ ఎక్సెలెన్స్ పేరుతో జ‌రిగిన ఈవెంట్‌లో ఈ ఇద్ద‌రూ స్టేజ్‌ను షేర్ చేసుకున్నారు. ఈ విష‌యాన్ని గ‌తంలోనే మాస్ట‌ర్ ఫేస్‌బుక్‌లో అనౌన్స్ చేశాడు. సంగీతం మ‌న‌సుల‌ను ఏకం చేస్తుంద‌న్న‌ది నిజ‌మే. ఉస్తాద్‌తో స్టేజ్‌ను షేర్ చేసుకోవ‌డం.. ఆయ‌న‌తో క‌లిసి ఓ బ్యూటిఫుల్ రిథ‌మ్‌ను సృష్టించ‌డం ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను అని మాస్ట‌ర్ ఫేస్‌బుక్‌లో చెప్పాడు. ఈ జుగ‌ల్‌బందీ నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

624
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS