ఎంపీలు స‌చిన్‌, రేఖ ఓటేయ‌లేదు.. ఎందుకో తెలుసా?Mon,July 17, 2017 01:26 PM

Sachin Tendulkar, Subramanian Swamy, Mary Kom cannot vote in Presidents election

న్యూఢిల్లీ: దేశ‌మంతా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌రుగుతున్న విష‌యం తెల‌సిందే క‌దా. పార్ల‌మెంట్‌తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. లోక్‌స‌భ, రాజ్య‌స‌భ‌లోని ఎంపీలు పార్లమెంట్‌లో ఓటేస్తున్నారు. కానీ రాజ్య‌స‌భ ఎంపీలే అయిన మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌, న‌టి రేఖ‌, బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి, బాక్స‌ర్ మేరీకోమ్ మాత్రం ఓటు వేయ‌డం లేదు. ఎందుకో తెలుసా.. వీళ్లంతా రాష్ట్ర‌ప‌తి నామినేటెడ్ ఎంపీలు. రాష్ట్ర‌ప‌తే వీళ్ల‌ను నామినేట్ చేశారు కాబట్టి ఆ ప‌ద‌వికి జ‌రిగే ఎన్నిక‌లో ఓటు వేయ‌డానికి వీళ్లు అర్హులు కాదు. వీళ్లే కాదు.. రాజ్య‌స‌భ‌లో మొత్తం 12 మందిని, లోక్‌స‌భ‌లో ఇద్ద‌రు ఆంగ్లో ఇండియ‌న్స్‌ను రాష్ట్ర‌ప‌తి నామినేట్ చేస్తారు. దీంతో ఈ 14 మందికి ఓటు వేసే హ‌క్కు ఉండ‌దు. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో ఈ న‌లుగురితోపాటు న‌టుడు సురేశ్ గోపి, రూపా గంగూలీ, న‌రేంద్ర జాద‌వ్‌, స్వ‌ప‌న్ దాస్‌గుప్తా, కేటీఎస్ తుల‌సి, ప‌రాశ‌ర‌ణ్‌, అను ఆగా, శంభాజీ రాజెల‌ను రాష్ట్ర‌ప‌తి రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేశారు. వీళ్లంతా వివిధ రంగాల్లో ప్ర‌ముఖులు.

4658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS