శబరిమల వివాదాన్ని బాబ్రీతో పోల్చిన ఏచూరి

Fri,October 19, 2018 04:22 PM

Sabarimala temple protests similar to Babri Masjid demolition, Says Sitaram Yechury

బాబ్రీ న్యూఢిల్లీ: శబరిమల వివాదంపై సీపీఎం నేత సీతారామ్ ఏచూరి స్పందించారు. శబరిమల వద్ద జరుగుతున్న విధ్వంసం.. బాబ్రీ మసీదు విధ్వంసం వంటిదే అని ఆరోపించారు. ఇది ఓటు రాజకీయాలకు ఉదాహరణ ఆని ఆయన విమర్శించారు. సామాజిక సామరస్యాన్ని ధ్వంసం చేస్తున్నారన్నారు. ఆలయంలోకి ప్రవేశించాలని భావిస్తున్నవారిని అడ్డుకోవడం శోచనీయమన్నారు. బాబ్రీ మసీదు ధ్వంసం సమయంలో చోటుచేసుకున్న ఆందోళనలే ఇప్పుడు శబరిమల వద్ద జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ ముగ్గురు మహిళలు శబరిమల సన్నిధానం వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారికి పోలీసులు రక్షణ కల్పించినా.. అయ్యప్ప దర్శనం లభించలేదు. శబరిమల వివాదం వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందని ఏచూరి ఆరోపించారు.

1251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles