తెరుచుకున్న త‌లుపులు.. వార్‌జోన్‌గా శ‌బ‌రిమ‌ల

Fri,November 16, 2018 05:20 PM

Sabarimala Temple opens for 62 day long Mandala Pooja

తిరువ‌నంత‌పురం: మండ‌ల మ‌క‌ర‌విల‌క్కు పూజ‌ల కోసం శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి ఆల‌య త‌లుపులు తెరిచారు. ఇవాళ‌ సాయంత్రం 5 గంట‌ల‌కు ఆల‌య ద్వారాల‌ను తెరిచారు. దీంతో భారీ సంఖ్య‌లో భ‌క్తులు అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకుంటున్నారు. మ‌రో వైపు శ‌బ‌రిమ‌ల ప్రాంతం అంతా వార్‌జోన్‌గా మారింది. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. కొచ్చి విమానాశ్ర‌యంలో సామాజిక కార్య‌క‌ర్త తృప్తి దేశాయ్‌.. ఇంకా దిగ్భందంలోనే ఉన్నారు. తృప్తి దేశాయ్‌ను ఆందోళ‌న‌కారులు అడ్డుకుంటున్నారు. భూమాత బ్రిగేడ్ మ‌హిళా కార్య‌క‌ర్త‌ల‌ను అడ్డుకున్న 250 మందిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ద‌ర్శ‌నం కోసం తృప్తి ఇవాళ ఉద‌యం 5 గంట‌ల‌కే కొచ్చి చేరుకున్నారు. అయితే త‌న‌కు ర‌క్షణ క‌ల్పించాలంటూ హైకోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు తృప్తి పేర్కొన్నారు. సుమారు 16 వేల మంది పోలీసులు శ‌బ‌రిమ‌ల‌లో ప‌హారా కాస్తున్నారు. 920 మంది మ‌హిళా పోలీసులు కూడా భ‌ద్ర‌త బృందంలో ఉన్నారు. రెండు ద‌శ‌ల్లో భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌నున్నారు. రెండు కంపెనీల ర్యాపిడ్ యాక్ష‌న్ ఫోర్స్‌, రెండు ద‌ళాల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా శ‌బ‌రిమ‌ల వ‌ద్ద భ‌ద్ర‌త క‌ల్పించ‌నున్నాయి.

1619
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles