వాజపేయి మృతిపట్ల సార్క్ దేశాల సంతాపం

Fri,August 17, 2018 11:51 AM

న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మృతిపట్ల సార్క్(సౌత్ ఏషియాన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) దేశాలు సంతాపం ప్రకటించాయి. సార్క్ దేశాలతో పాటు ప్రపంచ దేశాలు వాజపేయికి నివాళులర్పించాయి. తీవ్ర అనారోగ్యానికి గురైన వాజపేయి నిన్న సాయంత్రం కన్నుమూసిన విషయం విదితమే. వాజపేయి పార్థివ దేహానికి పాకిస్థాన్ న్యాయ, సమాచార శాఖ మంత్రి సయ్యద్ జఫర్ అలీ నివాళులర్పించే అవకాశం ఉంది. ప్రత్యేక విమానంలో పాకిస్థాన్ నుంచి ఢిల్లీకి జఫర్ అలీ రానున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాల విదేశాంగ శాఖల మంత్రులు కూడా వాజపేయి అంత్యక్రియలకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది.


నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ.. వాజపేయి మృతి పట్ల సంతాప సందేశాన్ని మోదీకి పంపారు. భారతదేశానికి వాజపేయి ఎంతో సేవ చేశారని కొనియాడారు. నిబద్ధతతో ఆయన పని చేశారని పేర్కొన్నారు. భారత ప్రజలందరూ వాజపేయిని జీవితాంతం గుర్తుంచుకుంటారని ఓలీ తెలిపారు. వాజపేయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు నేపాల్ ప్రధాని.

2027
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles