ప‌డిపోతున్న‌ రూపాయి !

Thu,May 24, 2018 02:49 PM

Rupee value on the fall, very soon it may hit all time low

ముంబై: విదేశీ మారకంతో రూపాయి విలువ రోజు రోజుకూ దారుణంగా పడిపోతున్నది. అమెరికా డాలర్‌తో ఇవాళ మన కరెన్సీ విలువ రూ.68.31గా నిలిచింది. త్వరలోనే రూపాయి విలువ కనిష్ట స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో అమెరికా డాలర్‌ తో రూపాయి విలువ రూ.68.87 ఆల్‌టైమ్ లోగా ఉంది. 2016 నవంబర్‌లో ఆ రికార్డు నమోదైంది. బుధ‌వారం అత్యల్పంగా రూ.68.42 వద్ద నిలిచింది. గత 18 నెలలతో పోలిస్తే, ఇదే అత్యల్పం. డాలర్ విలువ పెరగడం, క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో.. రూపాయి బలహీనపడుతున్నది.

ఈ ఏడాదిలోనే రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే సుమారు ఆరు శాతం పడిపోయింది. ఫోరెక్స్ అడ్వైజరీ సంస్థ ఐఎఫ్‌ఏ.. పతనమవుతున్న రూపాయి విలువపై ఆసక్తికర కామెంట్ చేసింది. రూపాయి మారకం వాల్యూ మునుముందు మరింత దిగజారే ప్రమాదం ఉందని తెలిపింది. త్వరలోనూ అమెరికా డాలర్ విలువ రూ.70గా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వల్ల.. దేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రణ లేకుండాపోతున్నాయి. దీని వల్ల ద్రవ్యోల్బణం కూడా శరవేగంగా పెరుగుతున్నది.

2610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles