మన రూపాయి.. ఏషియాలోనే బెస్ట్ కరెన్సీ

Wed,March 20, 2019 01:06 PM

Rupee is now Asias best performing Currency

న్యూఢిల్లీ: కొన్నాళ్ల కిందటి వరకు మన దేశ కరెన్సీ రూపాయి దారుణంగా పతనమైంది. ఆసియాలోనే అత్యంత చెత్త కరెన్సీగా నిలిచింది. కానీ కేవలం ఐదు వారాల్లో పరిస్థితులు తారుమారయ్యాయి. చెత్త కరెన్సీ కాస్తా.. బెస్ట్ కరెన్సీగా మారిపోయింది. ప్రధానమంత్రిగా మరోసారి నరేంద్ర మోదీనే ఎన్నికవుతారన్న అంచనాలు, ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రూపాయి కోలుకోవడానికి కారణమయ్యాయి. మోదీ గెలిస్తే రూపాయి మరింత బలపడుతుందని సింగపూర్‌లోని స్కోషియా బ్యాంక్‌కు చెందిన కరెన్సీ వ్యూహకర్త గావో కీ వెల్లడించారు. జూన్ చివరి కల్లా డాలర్‌తో రూపాయి మారకం విలువ 67కు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. దేశంలోకి డాలర్లు భారీగా తరలి వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో విదేశీయులు 330 కోట్ల డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దీంతో గతేడాది ఆగస్ట్ తర్వాత మళ్లీ ఇప్పుడు రూపాయి భారీగా బలపడింది. ఇప్పటికే రెండు ఒపీనియన్ పోల్స్ మోదీ సారథ్యంలోని ఎన్డీయే మెజార్టీకి అవసరమైన 272 స్థానాలను గెలుస్తుందని అంచనా వేయడం మార్కెట్లలో ఉత్సాహం నింపింది. మోదీ విజయంపై ఆశలు తప్ప మార్కెట్లలో ఈ సానుకూల ధోరణికి మరో కారణం లేదని కోటక్ సెక్యూరిటీస్ అనలిస్ట్ అరింద్య బెనర్జీ చెప్పారు.

1626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles