పాతాళంలోకి రూపాయి

Wed,October 3, 2018 12:29 PM

Rupee hits another all time low

ముంబై: ఇండియన్ రూపీ బుధవారం మరో జీవితకాల కనిష్ఠాన్ని తాకింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 73.34కు చేరింది. మంగళవారం గాంధీ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు ఉన్న విషయం తెలిసిందే. అయితే బుధవారం ఉదయం అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం రూపాయిపై పడింది. దీంతో విలువ మరింత పతనమైంది. సోమవారం 43 పైసల మేర పతనమై 72.91గా నిలిచింది. బుధవారం ఉదయం అది 43 పైసలు పతనమవడం విశేషం. అమెరికా ఖజానాకు భారీ ఆదాయం రావడంతో డాలర్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.

చాలా వరకు కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ నెల గరిష్ఠానికి చేరింది. ఆయిల్ ధరలు పెరుగుతున్నంత కాలం రూపాయి పతనం ఆగదని, అది 70-72 మధ్య ఉంటుందని సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. బుధవారం ఏషియా మార్కెట్లు పతనమవగా.. యూరప్ మార్కెట్లు మాత్రం కాస్త పుంజుకున్నాయి. మార్కెట్ల పతనంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. చాలా మంది పెట్టుబడిదారులు ముందు జాగ్రత్తగా బంగారం వైపు మళ్లడంతో పుత్తడి ధర అత్యధిక స్థాయిని తాకింది.

1938
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles