రూపాయి పతనం.. పండుగ చేసుకుంటున్న రాష్ర్టాలు!

Wed,September 12, 2018 12:39 PM

Rupee downfall and rising Crude Oil prices raises States revenue

ముంబై: ఓవైపు రూపాయి రోజురోజుకూ పతనమవుతుండటం, పెట్రో ధరలు పెరుగుతుండటం సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. కానీ రాష్ర్టాలు మాత్రం ఆకస్మిక ధనలాభంతో పండుగ చేసుకుంటున్నాయి. రాష్ర్టాల పన్ను ఆదాయం భారీగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టాలకు అదనంగా రూ.22700 కోట్ల రాబడి వచ్చింది. మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసలు పెరిగి రూ.72.73కి చేరింది. అటు చమురు ధర బ్యారెల్‌కు 78 డాలర్లను తాకింది. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రో ధరలు పెరిగితే వాటిపై వచ్చే పన్ను ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. ఇలా ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.22700 కోట్లు అదనంగా రాష్ర్టాల ఖాతాల్లో చేరినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ వెల్లడించింది.

బ్యారెల్ ముడి చమురు ధర ఒక డాలర్ పెరిగితే.. 19 ప్రధాన రాష్ర్టాల ఆదాయం రూ.1513 కోట్లు పెరుగుతుంది. ప్రస్తుతం ధరలు పెరగడం వల్ల అత్యధికంగా మహారాష్ట్రకు రూ.3389 కోట్ల అదనపు ఆదాయం రాగా.. తర్వాతి స్థానంలో రూ.2842 కోట్లతో గుజరాత్ ఉంది. ఢిల్లీలో మార్చి నుంచి ఇప్పటివరకు పెట్రోల్ లీటర్‌కు రూ.5.6, డీజిల్‌పై రూ.6.31 పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా పెట్రోల్ ధర రూ.89కి చేరడం విశేషం. మహారాష్ట్ర అత్యధికంగా 39.12 శాతం వ్యాట్ విధిస్తుండగా.. గోవా అత్యల్పంగా 16.66 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నది. ఈ ఆకస్మిక ఆదాయంతో రాష్ర్టాల ద్రవ్యలోటు 15 నుంచి 20 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు ఎస్‌బీఐ అంచనా వేసింది.

3448
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles