ప్రాణం పోయేంతవరకు అన్నాడీఎంకేను వీడను

Thu,May 2, 2019 12:57 PM

Rumours about joining BJP baseless wont leave AIADMK till I die says OPS

హైదరాబాద్ : తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం భారతీయ జనతా పార్టీలో చేరుతారని వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై పన్నీరుసెల్వం స్పందించారు. తన ప్రాణం పోయేంత వరకు అన్నాడీఎంకేను వీడను అని ఆయన స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరుతున్నానని వస్తున్న వార్తలు నిరాధారమైనవి అని పన్నీరుసెల్వం తేల్చి చెప్పారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన అన్నాడీఎంకేకు మోసం చేయనని పన్నీరుసెల్వం తెలిపారు. ఇటీవల వారణాసిలో మోదీ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా పన్నీరుసెల్వం, ఆయన కుమారుడు రవీంద్రనాథ్ కుమార్.. అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తండ్రీకుమారులిద్దరూ బీజేపీలో చేరుతున్నారని వార్తలు షికారు చేశాయి. పన్నీరుసెల్వం తమిళనాడుకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2001-02, 2014-15, 2016, డిసెంబర్ 6 నుంచి 2017, ఫిబ్రవరి 16 వరకు తమిళనాడుకు సీఎంగా పని చేశారు. ఆ తర్వాత 2017, ఆగస్టు 21 నుంచి డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఇక ఆర్థిక, గృహ, పట్టణాభివృద్ధి, టౌన్ ప్లానింగ్ మంత్రిగా కూడా పన్నీరుసెల్వం సేవలందించారు.

1299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles