ఆరెస్సెస్ ఈవెంట్‌కు రాహుల్‌గాంధీ!

Mon,August 27, 2018 02:36 PM

RSS to invite Rahul Gandhi to its event to be held in Delhi next month

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. సింపుల్‌గా ఆరెస్సెస్. ఈ పేరు వింటేనే అంతెత్తున లేస్తారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. దేశాన్ని మతపరంగా విభజిస్తున్నదంటూ ఆరెస్సెస్‌పై ఆయన విమర్శలు గుప్పిస్తారు. అలాంటి ఆ రాహుల్‌గాంధీనే తాము నిర్వహించబోయే ఓ కార్యక్రమానికి ఆరెస్సెస్ ఆహ్వానించనుందని వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల 17 నుంచి 19 వరకు ఢిల్లీలో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి రాహుల్‌తోపాటు సీతారాం యేచూరిలాంటి ఇతర ప్రతిపక్ష నేతలను కూడా పిలవాలని ఆరెస్సెస్ భావిస్తున్నది. భవిష్యత్తు భారత్‌పై ఈ కార్యక్రమంగా ప్రధానంగా దృష్టి సారించనుంది. ఈ ఏడాది జూన్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆరెస్సెస్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కాంగ్రెస్ వాది అయిన ప్రణబ్.. ఆ పార్టీ బద్ధశత్రువు ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లడంపై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకే ఆహ్వానం పంపాలని ఆరెస్సెస్ భావిస్తుండటం చర్చనీయాంశమైంది.

1911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles