ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలే మహిళల్ని అడ్డుకున్నారు..

Tue,October 23, 2018 01:20 PM

RSS stopped women from entering Sabarimala, says Kerala CM Pinarayi Vijayan

తిరువనంతపురం: శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లను తాము చేశామని, కానీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు ఆ ప్రాంతాన్ని యుద్ధ ప్రాంతంగా మలిచాయన్నారు. అన్ని వయసుల మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చు అని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కేరళలో ఉద్రిక్తత వాతావరణ నెలకొన్నది. సుప్రీం ఆదేశాలను పూర్తిగా అమలు చేశామని విజయన్ అన్నారు. ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ భక్తులను అడ్డుకోలేదన్నారు. ఆందోళనకారులు మాత్రమే వాహనాలను ఆపారని, మహిళా భక్తులను, మీడియా వ్యక్తులపై దాడులు చేశారన్నారు. శాంతిభద్రతల అంశంలో ఎటువంటి లోపం జరగలేదన్నారు. గత బధవారం ఆలయాన్ని నెలవారి పూజల కోసం తెరిచారు. ఆ తర్వాత ఆందోళనలు మిన్నంటాయి. సోమవారం రాత్రి ఆలయాన్ని మూసివేశారు. ఈ నేపథ్యంలో సీఎం విజయన్ మీడియా సమావేశం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

737
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles