ఆర్ఎస్ ప్రసాద్ గో బ్యాక్..బీజేపీ కార్యకర్తల నినాదాలు..వీడియో

Tue,March 26, 2019 08:29 PM

RS Prasad go back go back Bjp workers raise Slogans in patna


పాట్నా: పాట్నాలో బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఆందోళనకు దిగారు. పాట్నా సాహిబ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారిగా పాట్నాకు వచ్చారు. అయితే బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా మద్దతుదారులు..ఎయిర్ పోర్టు వద్ద రవిశంకర్ ప్రసాద్ కు స్వాగతం పలికేందుకు వెళ్లిన కార్యకర్తలను అడ్డుకున్నారు. నల్లజెండాలు పట్టుకుని ఆర్ఎస్ ప్రసాద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్ ఎస్ ప్రసాద్ గో బ్యాక్..ఆర్ కే సిన్హా జిందాబాద్..జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సొంత పార్టీ కార్యకర్తలే కేంద్రమంత్రిగా ఉన్న ఆర్ఎస్ ప్రసాద్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఆర్ఎస్ ప్రసాద్, ఆర్కే సిన్హా కాయస్థ కమ్యూనిటీకి చెందినవారు. అయితే ఆ కమ్యూనిటీకి చెందినవారంతా ఆర్ఎస్ ప్రసాద్ కు లోక్ సభ స్థానాన్ని కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా..బీజేపీ మాత్రం ఆర్ఎస్ ప్రసాద్ కే టికెట్ ఇచ్చింది.1683
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles