కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కు రూ.500 కోట్ల నష్టం

Mon,August 20, 2018 05:40 PM

Rs.500 crore worth loss at Kochi airport due to rains

కొచ్చి: కేరళలో వర్షాలు వల్ల కొచ్చి విమానాశ్రయానికి భారీ నష్టం వాటిల్లింది. విమానాల రాకపోకల రద్దు వల్ల సుమారు రూ.500 కోట్ల మేరకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. టర్మినల్ బిల్డింగ్‌ను శుభ్రం చేసేందుకు సుమారు 200 మంది పనిచేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆగస్టు 26 వరకు కొచ్చి విమానాశ్రయం నుంచి ఎటువంటి విమానాల రాకపోకలు ఉండవని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. అయితే సమీపంలో ఉన్న ఓ నౌకాదళ ఎయిర్ స్టేషన్ నుంచి పౌర విమానాలను నడపనున్నారు. వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎర్నాకుళం జిల్లాలో గత 4 రోజులగా సుమారు 50 వేల మందిని రక్షించారు.

3314
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles