పేదలకు రూ.5 లక్షల మెడికల్ రీఎంబర్స్‌మెంట్

Thu,February 1, 2018 12:02 PM

Rs.5 lakhs for medical reimbursement, says Arun Jaitley

న్యూఢిల్లీ : పేదల ఆరోగ్య రక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ స్కీమ్ కింద సుమారు 10 కోట్ల కుటుంబాల‌ పేదలకు వైద్య బీమా అందించనున్నది. ప్రతి ఏడాదికి ఈ స్కీమ్ కింద ఒక్కొక్క పేద కుటుంబానికి సుమారు రూ.5 లక్షల మేర ఉచిత వైద్యాన్ని అందించనున్నారు. జాతీయ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం కింద పేదలకు మెడికల్ రిఎంబర్స్‌మెంట్ కల్పించనున్నట్లు మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా స్థాయిలో ఉన్న 24 వైద్య కళాశాలను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం బాధ్యతయుతంగా సంపూర్ణ ఆరోగ్య బీమా కోసం మెల్లమెల్లగా ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. మెడికల్ స్కీమ్ వల్ల సుమారు 50 కోట్ల మందికి లాభం చేకూరే అవకాశాలున్నాయన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద మరో 2 కోట్ల టాయిలెట్లను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.

3224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles