రూ.20 వేల కోట్ల పన్ను ఎగవేత

Tue,February 12, 2019 07:46 AM

Rs 20,000 crore Tax avoidance in Delhi

న్యూఢిల్లీ: ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ఓ మనీ లాండరింగ్ రాకెట్ గుట్టు రట్టు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసిన దీని విలువ రూ.20,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సోమవారం ఐటీ శాఖ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం పాత ఢిల్లీలోని పలు వ్యాపార ప్రాంతాల్లో గతకొద్ది వారాలుగా ఢిల్లీ ఐటీ దర్యాప్తు విభాగం అధికారులు వరుసగా చేసిన దాడులు, సర్వేల్లో ఈ రాకెట్ బయటపడింది. మూడు గ్రూపులు ఆర్థికపరమైన అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని, ఈ క్రమంలోనే నయా బజార్‌లో ఓ గ్రూప్‌నకు చెందిన 12 బోగస్ సంస్థలు నకిలీ బిల్లులతో దాదాపు రూ.18,000 కోట్ల అక్రమ బిల్లింగులు జరిపినట్లు గుర్తించామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరో కేసులో రూ.1,000 కోట్లు, ఇంకో కేసులో రూ.1,500 కోట్ల అక్రమాలను పసిగట్టామని చెప్పారు. బోగస్ దీర్ఘకాలిక మూలధన లాభాలు, బోగస్ ఎగుమతులతో ఈ సంస్థలు రూ.20,000 కోట్లకుపైగా పన్ను ఎగవేతలకు పాల్పడ్డాయని వివరించారు. అయితే నిందితుల వివరాలను మాత్రం అధికారులు తెలియజేయలేదు.

895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles