వ్యవసాయ మార్కెటింగ్‌కు 2 వేల కోట్ల కార్పస్ ఫండ్

Thu,February 1, 2018 11:33 AM

Rs.2000 crores corpus fund for Agri Market

న్యూఢిల్లీ: వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. అగ్రి మార్కెట్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.2 వేల కోట్ల కార్పస్ ఫండ్‌ను కేటాయించింది. ఆ నిధులతో వ్యవసాయ మార్కెట్లను అభివృద్ధి చేయనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల పెంపు కోసం క్లస్టర్ మోడల్‌ను అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, స్పెషలైజ్డ్ ఆగ్రో ప్రాసెసింగ్ కోసం నిధులను వాడనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి తెలిపారు. ఆపరేషన్ గ్రీన్ కోసం సుమారు 500 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఆపరేషన్ ఫ్లడ్ తరహాలోనే ఆపరేషన్ గ్రీన్‌ను అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. రైతలకు నేరుగా డబ్బును ట్రాన్సఫర్ చేయడంలో పెద్ద సక్సెస్ సాధించినట్లు మంత్రి తెలిపారు. డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ స్కీమ్ ప్రపంచంలోనే అతి పెద్ద సక్సెస్ స్టోరీగా నిలిచిందన్నారు. ఖరీఫ్ పంటల కోసం కనీమ మద్దతు ధరను 1.5 రేట్లు పెంచినట్లు జైట్లీ తెలిపారు. వ్యవసాయ ఖర్చులను తగ్గించి, కనీస మద్దతు ధరను పెంచే ప్రక్రియలను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

1394
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles