రూ.2.25 కోట్ల విలువైన అగర్ వుడ్ సీజ్

Thu,March 14, 2019 08:41 PM

Rs 2.25 crore worth Agarwood seized at IGI Airport


న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అగర్ వుడ్ ను సీఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 45 కిలోల అగర్ వుడ్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని ధర మార్కెట్ లో రూ.2.25 కోట్లుందని అంచనా. సీఐఎస్ఎఫ్ అధికారులు ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. అగర్ వుడ్ ను అగర్ బత్తీలు, సుగంధ ద్రవ్యాల తయారీ, చిన్న శిల్పాలను చేసేందుకు వాడుతుంటారు. అగర్ వుడ్ రవాణా చట్టరీత్యా నేరం.

2214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles