గ్రామీణ మౌళిక సదుపాయాలకు రూ.14.34 లక్షల కోట్లు

Thu,February 1, 2018 11:44 AM

Rs.14.34 lakh crores to be spent on rural infrastructure, says Jaitley

న్యూఢిల్లీ: గ్రామీణ భారత రూపును మార్చేందుకు మోదీ ప్రభుత్వం నడుం బిగించింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలను కల్పించేందుకు సుమారు రూ.14.34 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఉజ్వల స్కీమ్ కింద మహిళలకు 8 కోట్ల ఉచిత గ్యాస్ కలెక్షన్లు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. సౌభాగ్య యోజన కింద 4 కోట్ల విద్యుత్ కనెన్షన్లు కూడా కల్పించినట్లు ఆయన చెప్పారు. వ్యవసాయానికి 2018-19 ఏడాదికి క్రెడిట్ కింద రూ.11 లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. నేషనల్ బాంబూ మిషన్ కింద వెదురు రంగం కోసం 1290 కోట్లు కేటాయించామన్నారు. ఫిషరీ, అక్వాకల్చర్ డెలప్‌మెంట్ ఫండ్ కింద 10వేల కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

1395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles