Telangana Intermediate 1st & 2nd Year Results 2019

టెలికాం రంగానికి 10వేల కోట్లు

Thu,February 1, 2018 02:16 PM

Rs.10000 crores allocated for Telecom infrastructure

న్యూఢిల్లీ: టెలికాం రంగ మౌళిక సదుపాయాల కోసం రూ.10 వేల కోట్లను కేటాయించారు. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని వెల్లడించారు. వేర్వేరు ప్రభుత్వ ప్రాజెక్టుల కింద టెలికం రంగాన్ని అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 2018-19 సంవత్సరానికి ఆ మొత్తాన్ని కేటాయినట్లు ఆయన చెప్పారు. భారత్ నెట్ ప్రాజెక్టు కింద అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా మార్చి 2019 వరకు సుమారు 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు కనెక్షన్లు ఇవ్వనున్నారు. భారత్ నెట్ మొదటి దశలో సుమారు లక్ష గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్‌ను కల్పించారు. అయిదు కోట్ల గ్రామీణ పౌరుల కోసం సుమారు 5 లక్షల వైఫై స్పాట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఐఐటీ మద్రాస్ సాయంతో దేశవ్యాప్తంగా 5జీ సెంటర్స్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు కేంద్రం సుమారు 3073 కోట్లను కేటాయించింది.

1784
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles