రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌ ఎంత దూరం ప్ర‌యాణిస్తుందో తెలుసా ?

Fri,September 6, 2019 06:31 PM

హైద‌రాబాద్‌: చంద్రుడిపై విక్ర‌మ్ ల్యాండ‌ర్ దిగిన త‌ర్వాత‌.. దాని నుంచి రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌ బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఆ రోవ‌ర్‌లో ఎటువంటి ప‌రిక‌రాలు ఉన్నాయో.. అది ఎంత దూరం ప్ర‌యాణిస్తుందో.. ఇలాంటి విష‌యాల‌ను ఇస్రో ఇవాళ ఓ ట్వీట్‌లో తెలిపింది. రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌ ప‌నితీరుపై ఇస్రో వీడియోను రూపొందించింది. రోవ‌ర్‌లో ఉన్న నావిగేష‌న్ కెమెరాలు రెండు ఉప‌రిత‌లాన్ని ఫోటోలు తీయ‌నున్నాయి. సోలార్ ప్యానెల్స్ తెరుచుకున్న త‌ర్వాతే రోవ‌ర్ ఎక్కువ ముందుకు వెళ్లే అవ‌కాశం ఉంటుంది. అయితే విక్ర‌మ్ ల్యాండ‌ర్ నుంచి బ‌య‌ట‌కువ‌చ్చిన త‌ర్వాత‌ రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌ అత్య‌ధికంగా కేవ‌లం 500 మీట‌ర్ల దూరం మాత్ర‌మే ప్ర‌యాణిస్తుంది. మ‌రిన్ని ఆస‌క్తిక‌ర అంశాల‌ను ఈ వీడియోల‌ను చూడండి.

2851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles