రాకీ యాదవ్ పిస్తోల్, కారు స్వాధీనం

Tue,May 10, 2016 10:30 AM

Rocky Yadav arrested in Bihar Road Rage Case

పాట్నా : బీహార్ ఎమ్మెల్సీ మనోరమా దేవీ కుమారుడు రాకీ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గర ఉన్న విదేశీ పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కారును ఓవర్ టేక్ చేసిన ఘటనలో రాకేశ్ రంజన్ యాదవ్ అలియాస్ రాకీ యాదవ్ రెండు రోజుల క్రితం బీహార్ యువకుడు ఆదిత్య సచ్‌దేవ్‌ను కాల్చి చంపాడు. బీహార్ రాష్ట్రంలో పెను సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రెండు రోజుల వేట తర్వాత ఎమ్మెల్సీ కుమారుడు రాకీను అదుపులోకి తీసుకున్నారు. ఆదిత్య సచ్‌దేవ్‌ను తానే చంపినట్లు రాకీ అంగీకరించాడు.

రాకీ పిస్తోల్‌కు ఢిల్లీలో లైసెన్స్ తీసుకున్నట్లు గయా సీనియర్ ఎస్పీ గరిమా మల్లిక్ తెలిపారు. రాకీ యాదవ్‌కు చెందిన ల్యాండ్ రోవర్ కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం పోలీసులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అయితే బోద్ గయాలో తండ్రి బిందేశ్వర్ ప్రసాద్ యాదవ్ కాంక్రీట్ ప్లాంట్‌లో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదిత్యను చంపిన కేసులో మిగతా నిందితులను త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు.


1986
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles