బ్యాంకు నుంచి 19.72 లక్షలు చోరీ

Mon,September 16, 2019 08:45 PM

జైపూర్ : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సోమవారం భారీ చోరీ జరిగింది. ఓ బ్యాంకులోకి ప్రవేశించిన ఆరుగురు దుండగులు.. తుపాకులతో సిబ్బందిని బెదిరించారు. అనంతరం బ్యాంకులో ఉన్న నగదును దొంగలు దోచుకెళ్లారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే ఈ బ్రాంచ్ చిన్నది కాబట్టి అక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేదు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొత్తం రూ. 19.72 లక్షల నగదు దోచుకెళ్లినట్లు సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.



1464
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles