50 ల‌క్ష‌ల ఖ‌రీదైన టీవీల‌ను ఎత్తుకెళ్లారు.. వీడియో

Tue,October 22, 2019 09:45 AM

హైద‌రాబాద్‌: బీహార్‌లో భారీ చోరీ జ‌రిగింది. ఓ గోడౌన్ నుంచి దొంగ‌లు సుమారు 50 ల‌క్ష‌ల ఖ‌రీదైన ఎల్ఈడీ టీవీల‌ను ఎత్తుకెళ్లారు. పాట్నాలోని మెహిదీగంజ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. సెక్యూర్టీ గార్డు, డ్రైవ‌ర్‌ను బంధించిన దుండ‌గులు.. టీవీల‌ను ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా పోలీసులు దొంగ‌ల కోసం గాలిస్తున్నారు. దంతేరాస్‌, దీపావ‌ళి పండుగ‌ల నేప‌థ్యంలో స్థానిక వ్యాపారి భారీ ఎత్తున టీవీల‌ను గౌడ‌న్‌కు తెప్పించారు. ఆదివారం రాత్రి 11.30 నిమిషాల‌కు ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. 250 ఎల్ఈడీ టీవీల‌తో పాటు 35 వేల న‌గ‌దు, సిల్వ‌ర్ నాణాల‌ను కూడా దొంగ‌లు దోచుకెళ్లారు.



1064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles