ప్రాణాలు తీస్తున్న య‌మునా ఎక్స్‌ప్రెస్‌వే

Sat,September 21, 2019 10:38 AM

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని య‌మునా ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య పెరుగుతున్న‌ది. ఈ ఏడాది జూలై 31వ తేదీ వ‌ర‌కు సుమారు 150 మంది చ‌నిపోయిన‌ట్లు రికార్డులు చెబుతున్నాయి. ఢిల్లీ నుంచి ఆగ్రా మ‌ధ్య 165 కిలోమీట్ల‌ర దూరంలో ఉన్న య‌మునా ఎక్స్‌ప్రెస్‌వే ఇప్పుడు డేంజ‌ర్ జోన్‌గా మారింది. ఈ ఏడాది స‌గం వ‌ర‌కే 357 రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగాయి. దాంట్లో 822 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. 2012 నుంచి య‌మునా ఎక్స్‌ప్రెస్ వే వినియోగంలోకి వ‌చ్చింది. ఆగ్రాకు చెందిన లాయ‌ర్ కృష్ణ చంద్ వేసిన ఆర్టీఐ పిటిష‌న్ ద్వారా ఈ విష‌యం తెలిసింది. 2018లో మొత్తం 659 రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగాయి. ఆ ప్ర‌మాదాల వ‌ల్ల 1388 మంది గాయ‌ప‌డ్డారు. 111 మంది మ‌ర‌ణించారు. 2017లో ఇదే ఎక్స్‌ప్రెస్‌వేపై 763 ప్ర‌మాదాలు జ‌రిగాయి. దాంట్లో 1426 మంది గాయ‌ప‌డ్డారు, 146 మంది మ‌ర‌ణించారు.

1546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles