జేడీయూలో చేరిన ఆర్ఎల్ఎస్పీ వైస్ ప్రెసిడెంట్

Sat,December 29, 2018 12:29 PM

RLSP vice president Bhagwan Singh Kushwaha supporters join JDU

పాట్నా : 2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) జాతీయ ఉపాధ్యక్షుడు భగవన్ సింగ్ కుష్వాహా అధికార పార్టీ జేడీయూలో చేరారు. జేడీయూ స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్ నారాయణ్ సింగ్ ఆధ్వర్యంలో తన మద్దతుదారులతో కలిసి కుష్వాహా జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా కుష్వాహా మాట్లాడుతూ.. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2020లో జరిగే బీహార్ శాసనసభ ఎన్నికల్లోనూ జేడీయూ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా ఇటీవలే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. బీహార్ ప్రజలకు మోదీ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఉపేంద్ర కుష్వాహా ఎన్డీఏకు గుడ్ బై చెప్పడంతో.. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మాత్రం ఎన్డీఏతోనే ఉంటానని చెప్పి జేడీయూలో చేరారు.

907
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles