ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌ పచౌరీపై లైంగిక వేధింపుల కేసు

Fri,September 14, 2018 04:31 PM

RK Pachauri to be charged for sexual harassment of former TERI colleague

న్యూఢిల్లీ: ద ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్‌టిట్యూట్(తెహ్రీ) మాజీ డైరక్టర్ ఆర్‌కే పచౌరీపై లైంగిక ఆరోపణల కింద కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఉద్యోగి ఒకరు పచౌరీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 354(అగౌరవపరచడం), సెక్షన్ 354ఏ(శారీరకంగా ఇబ్బందిపెట్టడం), సెక్షన్ 509(చెడు భాష, సంకేతాలు) కింద అభియోగం నమోదు చేయాలంటూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ చారు గుప్తా ఆదేశించారు. పచౌరీపై మిగతా కేసుల విషయంలో అక్టోబర్ 20వ తేదీ తీర్పులో వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. 2015, ఫిబ్రవరి 13న పచౌరీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత మార్చి 21న ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరీ చేశారు.

1279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS